2022 సంవత్సరంలో రాణించి 12 ఏళ్ల తర్వాత భారత్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న పేస్ బౌలర్ ఉనద్కత్..ఆదే ఊపును 2023లో కూడా కొనసాగిస్తున్నాడు. కొత్త సంవత్సరం మొదటి ఓవర్ లోనే అద్భుతమైన ఘనత అందుకున్నాడు. ఢిల్లీతో జరుతున్న రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్ ఉనద్కత్ హ్యాట్రిక్ సాధించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మూడు, నాలుగు, ఐదు బంతుల్లో ధృవ్ షోరే, వైభవ్ రావల్, యష్ ధుల్‌లను ఔట్ చేశాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది తొలి ఓవర్ హ్యాట్రిక్. తన తర్వాతి ఓవర్లో ఉన్ద్కత్ మరో రెండు వికెట్లు తీశాడు. దీంతో ఢిల్లీ 10 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో ఉన్న ఢిల్లీని హృతిక్ షోకీన్ 68 , శివంక్ వశిష్ట్ 38 పరుగులు చేసి ఆదుకోవడంతో చివరికి 133 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.
ఈ మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లు తీసి కెరీర్లో ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు ఉనద్కత్. తన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొత్తం 21 సార్లు ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. ఈ మధ్యకాలంలో ఉనద్కత్ బౌలర్‌గా, కెప్టెన్ గా అత్యుత్తమ స్థితిలో రాణిస్తున్నాడు. అతని సారథ్యంలోనే విజయ్ హజారే ట్రోఫీ టైటిల్‌ను సౌరాష్ట్ర గెలుచుకుంది. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 10 మ్యాచ్‌లలో 19 వికెట్లు సాధించాడు. అనంతరం టీం ఇండియా నుంచి ఉనద్కత్ కు 12 ఏళ్ల తర్వాత పిలుపొచ్చింది.
ఇవి కూడా చదవండి :
చిన్నారి డ్యాన్స్‌కి ఏనుగు ఫిదా.. వైరల్ వీడియో
నాలుగు సీట్ల గాల్లో ఎగిరే కారు వచ్చేస్తున్నది!