జయేంద్ర వారసుడు శంకర విజయేంద్ర - MicTv.in - Telugu News
mictv telugu

జయేంద్ర వారసుడు శంకర విజయేంద్ర

March 1, 2018

కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మృతి నేపథ్యంలో పీఠం 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతి పగ్గాలు చేపట్టనున్నారు. 1969లో పుట్టిన విజయేంద్ర అసలు పేరు శంకరనారాయణన్‌. తిరువళ్లూరు జిల్లా ఆరణి సమీపంలోని పెరియపాళయం గ్రామంలో ఆయన జన్మించారు. 1983లో ఆధ్యాత్మిక గురువయ్యారు. జయేంద్రకు ముఖ్య శిష్యుడిగా పేరొందారు.జయేంద్ర హత్య కేసుల్లో, భూవివాదాలల్లో ఉన్నప్పుడు ఆయన వెన్నేంటే ఉన్నారు. భారతీయ సంప్రదాయ సాహిత్యాన్ని భద్రపరచానికి కృషి చేశారు. కంచిపీఠాన్ని క్రీ.శ 482లో ఆది శంకర భగవత్పదచార్య స్వామి నిర్మించినట్లు ప్రతీతి.