కేసీఆర్‌పై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌పై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

March 9, 2022

13

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారని ప్రశంసించారు. ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఉద్యోగాల భర్తీతో యువతలో క్రేజ్ వస్తుందనీ, దాంతో పాటు పొలిటికల్ మైలేజ్ కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలివ్వడానికే డబ్బులు లేవని విమర్శించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదేనన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇంకా రెండేళ్లు మాకు హైదరాబాదే రాజధాని అంటూ బదులిచ్చారు. మూడు రాజధానుల అంశంపై ప్రశ్నించగా, మూడు కాకపోతే పది రాజధానులు పెట్టుకోవచ్చనీ, అంతా ముఖ్యమంత్రి జగన్ ఇష్టం అంటూ సమాధానమిచ్చారు.