జేసీ సూట్‌కేసు నుంచి రూ. 6 లక్షలు మాయం.. దొంగ ఎవరంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

జేసీ సూట్‌కేసు నుంచి రూ. 6 లక్షలు మాయం.. దొంగ ఎవరంటే..

October 14, 2019

Jc Diwakar Reddy  .

మాజీ ఎంపీ టీడీపీ సీనియర్ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి సూట్ కేసు నుంచి రూ. 6 లక్షలు మాయం అయ్యాయి. విజయవాడలో ఆయన హోటల్ గదిలో ఈ చోరీ జరిగింది. ఈ నెల 11న ఓ ఓ హోటల్ బస చేసి అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లిన ఆయన తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి సూట్‌కేసు తెరిచి చూస్తే డబ్బు కనిపించలేదు. వెంటనే ఆయనకు పోలీసులకు ఫిర్యాదు చేడంతో దర్యాప్తు చేపట్టి అసలు దొంగను గుర్తించారు. 

ఈ చోరీ అసలు దొంగ అతని వద్ద పనిచేసే కారు డ్రైవర్ గౌతమ్ అని పోలీసులు గుర్తించారు. డబ్బు సూట్‌కేసు హోటల్ గదిలోకి గౌతమ్ తీసుకువెళ్లాడు. రూంలో పెట్టిన తర్వాత జేసీ డబ్బులు చూసుకోగా రూ. 6 లక్షలు కనిపించలేదు. డ్రైవర్ పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేడంతో వారి స్టైల్‌లో విచారించారు. ఆ డబ్బు తానే తీశానని ఒప్పుకున్నాడు. ఆ నగదు కూడా కారు సీటు కింద దాచిపెట్టినట్టు వెల్లడించడంతో దాన్ని జేసీకి అప్పగించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.