విమానమెక్కలేక.. కక్కలేక.. మింగలేక దివాకర్ రెడ్డి..! - MicTv.in - Telugu News
mictv telugu

విమానమెక్కలేక.. కక్కలేక.. మింగలేక దివాకర్ రెడ్డి..!

July 10, 2017

తనకోపమే తన శత్రువు అని  పెద్దలు ఊరికనే అన్నరా..టిడిపి  యంపి జెసీ దివాకర్ రెడ్డి పరిస్ధితి గుడ ఇప్పుడు అట్లనే ఐంది,అప్పుడెప్పుడో విశాఖపట్నంల  ఇండిగో విమాన సంస్ధ సిబ్బందితోని కొట్లాటకు దిగిండు…దెబ్బకు ఈ ఎంపీగారిని మా విమానాలల్ల ఎక్కనియ్యం అని దేశీయ విమాన సంస్ధలన్నీ  సారు మీద పగ వట్టినయ్,మరి ఏ అప్పుడెప్పుడో పంచాది వెట్కున్న గాళ్లు ఇప్పటిదాక  గుర్తుంచుకుంటారు అన్కున్నడో ఏమో సారు….మొన్న రాత్రి  విజయవాడ వెళ్లేటందుకు  శంశాబాద్ ల  స్పైస్ జెట్ విమానం ఎక్కి కూసుండట, జర్రైతే  విమానం  ఆకాశవీదిల ఎగిరేదట..ఇంతల్నే  సారు గ పొద్దు  అన్న  బంగారు ముచ్చట్లన్ని  యాదికచ్చి ఆయింత  విమానం దించేశిన్రట స్పైస్ జెట్టు విమానం సిబ్బంది,ఇంకేముంది సారు..మాట ముచ్చట మాట్లాడకుండ వాపస్ ఎళ్లిపోయిండు,మల్లా ఆదివారం పొద్దుగాళ్ల గుడ..ట్రూ జెట్ విమానంలెక్కుదామని టికెట్ దెప్పించుకుండట, పాపం సారు శంశాబాద్ దాక అచ్చి మల్లా మర్రి పోవుడెందుకు.. ఉత్తగ పెట్రోల్ దండుగ, టైం వేస్ట్  అని ముందే  ఫోన్ జేశి శెప్పిన్రట..సారు మీరు ఇంత దూరంమచ్చినా మేం ఎక్కిచ్చుకోం అని ట్రూజెట్ విమాన సంస్థోళ్లు గుడ.అటు విమానం ఎక్కలేక..ఇటు కక్కలేక, మింగలేక  ఎంత ఇబ్బంది వడ్తున్నడో సారు.

Tags: