JC Prabhakar Reddy said that people should change
mictv telugu

ప్రజలు గౌరవమిస్తారని గడ్డం పెంచుతున్నా : జేసీ ప్రభాకర్ రెడ్డి

September 6, 2022

JC Prabhakar Reddy said that people should change

రాజకీయాలు, ఓటర్లపై తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ నాయకులకు ప్రజల్లో గౌరవం తగ్గిపోయిందని వాపోయారు. అందుకు కొందరు రాజకీయనాయకులు కూడా కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.

గడ్డం చూసైనా ప్రజలు తనకు గౌరవమిస్తారనే నమ్మకంతో తెల్లగడ్డం పెంచుతున్నానని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కనీస విలువల్లేని కారణంతో ప్రజలు మమ్మల్ని అసహ్యించుకుంటున్నారని నిర్వేదం వ్యక్తం చేశారు. అటు ప్రజల్లో కూడా మార్పు రావాలని ఆకాంక్షించారు. డబ్బులు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు ఓటు వేసిన నాడు వారికి మమ్మల్ని గల్లా పట్టి అడిగే హక్కు ఉంటుందని వివరించారు. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే రాజకీయ నాయకులకు ఓటర్లంటే భయం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్నికలప్పుడు ఓట్లడగడానికి వెళ్తే ఎంతిస్తావని అడుతున్నారని, వారికి పంచిన డబ్బులు మాకు తిరిగి రావాలి కదా అని అన్నారు. ఇక్కడే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని, వ్యవస్థ మారాలంటే ముందు ప్రజలే మారాలని హితవు పలికారు. ప్రజలకు సేవ చేయాలనుకునే వారు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారని, దయచేసి వారిని కూడా డబ్బులడిగి కోల్పోకూడదని సూచించారు.

https://fb.watch/fn5mSxt5Dk/