JCB machine, cement mixer used to make 'Prasad' at Madhya Pradesh
mictv telugu

జేసీబీ, కాంక్రీట్ మిక్సర్‌లతో ప్రసాదం తయారీ

November 18, 2022

ఏదో పది, ఇరవై మందికైతే ఈజీగా వంట చేయోచ్చేమో కానీ… ఒకేరోజులో లక్షల మందికి అంటే మాత్రం చాలా శ్రమతో కూడుకున్నది. ఒక్కోసారి వంట మనుషులు కూడా అందుబాటులో లేకపోతే ఇబ్బందే మరి. అయినా అంతా మిషనరీతో నడుస్తున్న ఈ రోజుల్లో మనుషులతో పెద్దగా పని ఏముందనుకున్నారో ఏమో కానీ.. ఓ ఆలయ నిర్వాహకులు మాత్రం కాస్త విచిత్రంగా జేసీబీను ఉపయోగిస్తున్నారు. 40 టన్నుల పిండి.. వందల కిలోల బెల్లం.. క్వింటాళ్ల కొద్దీ కూరగాయలు.. రాష్ట్రంలోనే అతిపెద్ద వంట పాత్రలు.. లక్షల సంఖ్యలో భక్తులు.. మరి వారికి సమయానికి ప్రసాదాన్ని అందించాలంటే జేసీబీలనే గుడ్ చాయిస్ అంటున్నారు.

మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలోని దంద్రౌవా ధామ్కు లక్షల మంది భక్తులు వస్తుంటారు. వారందరికీ సరిపోయే విధంగా వంటలు చేసేందుకు ఏకంగా భారీ యంత్రాలనే ఉపయోగిస్తుంటారు. రాష్ట్రంలోనే అతిపెద్ద పాత్రలను ఇక్కడ వంటలు తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు. వంటకాలను కలపడం, ఇతర పాత్రల్లోకి మార్చడం వంటి పనుల కోసం జేసీబీని ఉపయోగిస్తున్నారు. మానవ శ్రమను తగ్గించి, వేగంగా వంటలు చేసేందుకు భారీ యంత్రాలు వినియోగిస్తున్నారు. అతిపెద్ద పాత్రలో కూరగాయలు వండుతారు. పిండి కలిపేందుకు కాంక్రీటు మిక్సర్ను ఉపయోగిస్తారు. ఇక్కడ వినియోగించే ఓ పాత్ర రాష్ట్రంలోనే అతిపెద్దది కావడం విశేషం.