నేను.. జేడీ లక్ష్మినారాయణ భార్యను.. - MicTv.in - Telugu News
mictv telugu

నేను.. జేడీ లక్ష్మినారాయణ భార్యను..

April 5, 2018

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మినారాయణ భార్యనంటూ ఒక మహిళ ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇంటివద్ద హల్‌చల్ చేసింది. . అమరావతిలోని ఉండవల్లిలో ఉన్న సీఎం ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను లక్ష్మినారాయణ భార్యనని, ఎ పనిపైన సచివాలయానికి వెళ్తున్నానని తెలిపింది.సచివాలయానికి వెళ్లేదానివి, ఇక్కడెందుకు తిరుగుతున్నామని పోలీసులు ప్రశ్నించారు. ఆమె సరైన సమాధనం చెప్పకపోవడంతో ఆరా తీశారు. తన భర్త మాదిరే తాను కూడా సీబీఐ అధికారినని సమాధానమిచ్చింది. పోలీసు అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద ఉన్న వస్తువులను పరిశీలించారు. అందులో ఒక ఐడీ కార్డుపై ఎర్విన్‌ రీటాగా అని ఉంది. భర్త పేరు వద్ద వివి. లక్ష్మినారాయణ అని ఉంది. తదుపరి విచారణ కోసం ఆమెను తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. లక్ష్మినారాయణ స్వచ్ఛంద పదవీ విమరణ తీసుకుని రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.