ప్రశాంత్ కిశోర్‌ సేవల కోసం..మరో పార్టీ యత్నాలు! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రశాంత్ కిశోర్‌ సేవల కోసం..మరో పార్టీ యత్నాలు!

February 26, 2020

cv ncvn

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నో రాజకీయ పార్టీలు అధికారలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెల్సిందే. ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో విజయం సాధించడంలో ప్రశాంత్ కిషోర్ హస్తం ఉంది. దీంతో ప్రశాంత్ కిషోర్‌కి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. తాజాగా మరో పార్టీ ఆయన్ను సంప్రదించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ పార్టీ నాయకులు కుమారస్వామి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో పనిచేసే ఐప్యాక్ సేవలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. 

ఇప్పటికే ప్రశాంత్ కిషోర్‌తో కుమారస్వామి చర్చలు జరిపారు. ఈ విషయాన్ని మంగళవారం కుమారస్వామే స్వయంగా వెల్లడించారు. ‘మేము ప్రశాంత్‌కిశోర్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం. అతడు మాకు ఎన్నికల్లో పనిచేయనున్నారు. 2023లో మేం సొంతంగా అధికారంలోకి వస్తాం’ అని కుమారస్వామి తెలిపారు. కర్ణాటకలో 14 నెలల క్రితం జేడీఎస్‌, కాంగ్రెస్‌ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కొందరు ఎమ్మెల్యేల రాజీనామాతో విశ్వాస పరీక్షలో నెగ్గలేక ఆ ప్రభుత్వం పడిపోయింది. తరువాత మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.