కాలేజీ ప్రిన్సిపాల్‌పై చేయి చేసుకున్నాడో ఎమ్మెల్యే. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే శ్రీనివాస్ జూన్ 20వ తేదీన మాండ్యాలోని నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరుగుతున్న కంప్యూటర్ ల్యాబ్‌కు సంబంధించిన పనుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ క్రమంలో కాలేజీ ప్రిన్స్‌పాల్.. ఎమ్మెల్యే అడిగిన ప్రతీ ప్రశ్నకి పొంతనలేని సమాధానాలు చెప్పాడని.. అందరి ముందు ప్రిన్సిపాల్ చెంప పగులకొట్టాడు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాకయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కొందరు తెలిపారు. మరికొందరు దీనిపై వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయాలని ప్రిన్సిపాల్ కు సూచిస్తున్నారు.
JanataDal MLA M Srinivas slaps the Principal of Nalwadi krishnaraja college in Karnataka in infront of everyone
This happens when power goes to head
Shame😈 pic.twitter.com/8RTCCud8Mo
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) June 21, 2022