వెంకయ్యకు ఓటు వేయమన్న జేడీయూ... - MicTv.in - Telugu News
mictv telugu

వెంకయ్యకు ఓటు వేయమన్న జేడీయూ…

July 31, 2017

ఆర్జేడీకి టాటా చెప్పేసి, బిజేపి తో దోస్త్ కట్టిన జేడీయూ. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి వెంకయ్యనాయుడుకు ఓటు వేయడం లేదని జేడీయూ పేర్కొంది. ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీకే తమ ఓటు అని ఆ పార్టీ అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టంచేశారు. ఎన్డీయే లో చేరక ముందు మహాకూటమిలో ఉన్నప్పుడే గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేయడంలో నితీష్ కీలక పాత్ర వహించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాధ్ కోవింద్ కు ఓటేసిన జేడీయూ. ఇప్పుడు గోపాలకృష్ణ కు ఓటు వేసే విషయాన్ని బీజెపీ కి చెప్పామని ఆ పార్టీ అధికార ప్రతినిధి త్యాగి తెలిపారు . ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థికి ఓటు వేయడం ఖాయం. ఇదొక విషయంలో తప్ప మిగతా అన్ని నిర్ణయాలన్నింటికి ఎన్డీయే కే మద్దతు ఇవ్వాలని జేడీయూ తమ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.