JEE Main Session 2 result, Rank Cards released on jeemain.nta.nic.in 
mictv telugu

జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 ఫలితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదిగో..

August 8, 2022

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) విడుదల చేసింది. ర్యాంకు కార్డులను అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. ఆదివారం ప్రొవిజనల్ ఫైనల్ కీని విడుదల చేసిన ఎన్‌టీఏ తాజాగా జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 ఫలితాలు విడుదల చేసింది. జులై 25 నుంచి 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పి.రవికిశోర్‌ ఆరో ర్యాంకు సాధించగా.. ఎం.హిమవంశీ ఏడు, పల్లి జలజాక్షి తొమ్మిదో ర్యాంకు దక్కించుకున్నారు. రిజల్ట్స్ కోసం ఈ లింక్ ను ttps://ntaresults.nic.in/resultservices/JEEMAINauth22s2p1 క్లిక్ చేయండి.

అంతకుముందు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన యశ్వంత్, ఏపీకి చెందిన ఆదినారాయణ పి, కే సహాస్, పి రవిశంకర్‌ 100 పర్సంటైల్ సాధించడం విశేషం.