తెలుగు మీడియం విద్యార్థులకు శుభవార్త..  - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు మీడియం విద్యార్థులకు శుభవార్త.. 

November 29, 2019

telugu ...

మన దేశంలో దాదాపు అన్ని జాతీయస్థాయి పరీక్షలను ఇంగ్లిష్ లేదా, హిందీలో రాయాల్సి వస్తోంది. దీంతో ఇతర భాషా మాధ్యమాల్లో చదువుకున్న విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్ పరీక్షను తెలుగుతోపాటు మరికొన్ని భారతీయ భాషల్లోనూ  రాసేందుకు కూడా కేంద్రం అనుమతిచ్చింది. 

ఈ పరీక్షను తెలుగులోనూ నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్‌డీ) తెలిపింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా,  ఉర్దూ భాషల్లోనూ ఈ పరీక్ష్ నిర్వహించనున్నారు.ఈమేరకు పరీక్ష నిర్వహణపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ)కి ఆదేశాలు కూడా జారీ చేసింది. 2021 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. జేఈఈ మెయిన్స్‌ను ప్రస్తుతం ఇంగిష్, హిందీ భాషల్లోనే నిర్వహిస్తున్నారు.