హైదరాబాద్ నగర శివారు జీడిమెట్లలో ఓ ఫ్యాక్టరీలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అరోరా ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు గాయపడ్డారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రసాయన పదార్థాలు కలుపుతున్నప్పుడు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియడం లేదు. గతంలోనూ ప్రమాదాలు జరిగాయని, యాజమాన్యం బయటికి రాకుండా మేనేజ్ చేసిందని ఆరోపణలు వస్తున్నాయి. జీడిమెట్లలో పలు ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.