Jeedimetla: Massive Fire Breaks Out At Sridhara Biotech Private Limited, 7 Injured
mictv telugu

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం.. కెమికల్ రియాక్టర్లు పేలడంతో..

August 22, 2022

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్ వి కోపరేట్ లో ఉన్న శ్రీధర్ బయో టెక్ లో భారీ పేలుడు సంభవించింది. సోమవారం ఉదయం ఒకే సమయంలో 5 రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని శాపూర్‌నగర్‌లోని గురు రామ్ ఆసుపత్రికి తరలించారు. కెమికల్ ప్రాసెస్ చేస్తుండగా రియాక్షన్ అయ్యి ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడతో స్దానికులు భయాందోళనలతో రోడ్డుపైకి పరుగులుతీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ఒకదాని తరువాత ఒకటి వరుస పేలుళ్లతో సమీప ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు జీడిమెట్ల, కూకట్‌పల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది 5 ఫైర్ ఇంజన్‌లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో కార్మికులు లక్ష్మణ్ నాయుడు, వెంకట్ రమణ రెడ్డి, ప్రవీణ్, కృష్ణ రెడ్డి, జామీర్, నరసింహారావు, శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరిలో జమీర్ 70 శాతం గాయాలతో శంకర్, నర్సింహ 50 శాతం గాయాలతో ఉన్నట్లు తెలుస్తుంది.షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై ఫైర్ ఆఫీసర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఏడుగురికి గాయాలయ్యాని తెలిపారు.. నలుగురిని గురు సుజన ఆసుపత్రికి, ముగ్గురిని గురు రామ్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పొగ చుట్టుపక్కల వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు.