వరంగల్‌.. బావిలో పడిపోయిన ప్రయాణికుల జీపు - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్‌.. బావిలో పడిపోయిన ప్రయాణికుల జీపు

October 27, 2020

వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్యాసింజర్ జీపు అదుపు తప్పి బోల్తా కొట్టి బావిలో పడిపోయింది. ముగ్గురు గల్లంతుకాగా 12 మందిని స్థానికులు కాపాడారు. సంగెం మండలం గవి చర్ల వద్ద ఘోర రోడ్డులో  ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి నెక్కొండకు 15 మందితో వెళ్తున్న జీపు అదుపు తప్పింది. ప్రమాదం సమయంలో కొందరు బయటికి దూకినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు జేసీబీని తీసుకెళ్లి జీపును బయటికి తీస్తున్నారు. ముగ్గురు ఇంకా బావిలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. బురదగా ఉండడంతో సహాయక చర్యలుకు ఆటంకం కలుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.