ధోనీతో కలిసి జీప్ కడిగిన జీవా..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ధోనీతో కలిసి జీప్ కడిగిన జీవా..వీడియో

October 25, 2019

భారత క్రికెట్ జట్టు మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని స్టార్ క్రికెటరే అయినప్పటికీ కార్లన్నా, బైకులను ఎంతో ఇష్టపడతాడు. ధోని తన వాహనాల కోసం ఓ మ్యూజియంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. 

తాజాగా ధోని ‘నిసాన్‌ జొంగా’ జీప్‌‌ను కొన్నాడు. తన జీప్‌ను ధోనీ కడుగుతుంటే, ఆయన కూతురు జీవా తండ్రికి తనవంతు సాయాన్ని చేస్తుంది. దీనికి సంబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపావళి సందర్భంగా వాహనాలను శుభ్రం చేసే పనిని పెట్టుకున్న ధోని, ఓ వస్త్రంతో వాహనాన్ని తుడుచుకునే పనిలో పడ్డాడు. తండ్రికి సాయం చేసేందుకు తన చిన్ని చేతులతో జీవా కూడా ముందుకు వచ్చింది. 

ఈ వీడియోను ధోని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ ‘పెద్ద పనికి చిన్న సాయం… ఎప్పటికీ ప్రత్యేకమే’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోకు గంటలో 7 లక్షలకు పైగా వ్యూస్, వేలాది కామెంట్లు వచ్చాయి. మేము కూడా వచ్చి సాయం చేస్తామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.