‘దళం’ జీవన్  బ్యాక్ విత్ ‘జార్జ్ బయోపిక్’ - MicTv.in - Telugu News
mictv telugu

‘దళం’ జీవన్  బ్యాక్ విత్ ‘జార్జ్ బయోపిక్’

July 21, 2017

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి జీవితకథతో దళం దర్శకుడు జీవన్ రెడ్డి తన రెండో సినిమా చేయబోతున్నాడు. రాంగోపాల్ వర్మ ‘వంగవీటి’ సినిమాలో రంగ, రాధ పాత్రల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సాండి ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో జార్జ్ రెడ్డి పాత్రను చేయబోతున్నాడు. ఇటీవలి కాలంలో వందకోట్లు వసూలు చేసి దేశంలో సంచలనం సృష్టించిన మరాఠీ సినిమా ‘సాయిరాత్’  కెమెరామన్ సుధాకర్ ఎక్కంటి ఈ సినిమాకు కెమెరా మెన్. ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న జార్జ్ రెడ్డి బయోపిక్ పై ఇండస్ట్రీలో ఇప్పటికే అంచనాలు పెరిగాయి.

మూడేళ్ల క్రితం వచ్చిన ‘దళం’ సినిమా తర్వాత జీవన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తున్న ఈ మూవీ 1962 నుంచి 1972 సంవత్సరాల్లో విద్యార్థి రాజకీయాలు, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఓయూ పరిణామాలు, జార్జ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఫ్రీప్రొడక్షన్ కు సంబంధించిన వర్క్  కంప్లీట్ అయ్యిందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.  హైదరాబాద్, వరంగల్, కేరళ, ఔరంగాబాద్, ముంబాయి, పూణె లో ఈ సినిమా చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. భారీ బడ్జెట్ తో తెలుగు సినిమాల్లోనే ఒక డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ సినిమాలో ప్రముఖ తెలుగు నటులతో పాటు హిందీ, తమిళ, మళయాల నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ను రెండు ప్రధాన నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు దర్శకుడు జీవన్ చెప్పారు.