దళిత మహిళకు పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

దళిత మహిళకు పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

April 14, 2022

 reeee

మనిషిని మనిషిగా చూడలేని దురాచారం అంటరానితనమని, ఇలాంటి అనాగరిక ఆచారం సమాజ అభివృద్ధికి అవరోధంగా మారుతాయని ఆర్మూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి చెడు లక్షణాలను సమాజం నుంచి దూరం చేస్తేనే సమగ్రాభివృద్ది సాధ్యమని చెప్పడానికి ఎమ్మెల్యే ఓ నూతన పనికి ఒడిగట్టారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఓ దళిత మహిళ పాదాలను పాలతో కడిగారు. మాక్లూర్ మండలంలోని మాణిక్ బండార్ గ్రామంలో సఫాయి కార్మికురాలిగా పని చేసిన 70 ఏళ్ల దుర్పతి అనే దళిత మహిళ కాళ్లను పాలతో కడిగి పాదాభి వందనం చేశారు. తన చర్యతో సమాజంలో మార్పు రావాలని కోరుకున్నారు. అంబేద్కర్ ఆశయాలతో నడుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యాఖ్యానించారు. దళిత బంధు పథకంతో మొన్నటి వరకూ ట్రాక్టర్ డ్రైవరుగా పని చేసిన వ్యక్తి ఈరోజు ట్రాక్టర్ ఓనర్ అయ్యాడని వివరించారు. ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని, కులాల పేరుతో, మతాల పేరుతో కొట్టుకుంటే ఎంత మంచి చేసినా లాభం ఉండదని బోధించారు. అంటరానితనాన్ని వెళ్లగొడితే అంబేద్కర్‌కు అదే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.