జీవితపై నా ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయి.. సంధ్య - MicTv.in - Telugu News
mictv telugu

జీవితపై నా ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయి.. సంధ్య

April 18, 2018

నటి జీవిత.. తన భర్త రాజశేఖర్ వద్దకు అమ్మాయిలను పంపేదని సామాజిక కార్యకర్త సంధ్య సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. దీంతో జీవిత అగ్గిమీద గుగ్గిలమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సంధ్య తేలిగ్గా తీసుకున్నారు.

జీవిత.. అమీర్‌పేట్ హాస్టళ్ల నుంచి అమ్మాయిలను రాజశేఖర్ వద్దకు పంపేదని చెప్పడానికి తన వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని ఓ టీవీ చానల్‌తో చెప్పింది. అయితే బాధితులను మీడియా ముందుకు తీసుకురావడం తనకు ఇష్టం లేదని, వారి భవిష్యత్తును దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు.


“ఆపదలో ఉన్న అమ్మాయిలకు నేను ప్రతి మంగళవారం, శుక్రవారం కౌన్సెలింగ్‌ ఇస్తాను. ఏడేళ్ల కిందట ఇద్దరమ్మాయిలు నా వద్దకు వచ్చారు. వారు ఓ హాస్టల్‌లో ఉండేవారు. వారిలో ఒక అమ్మాయి పల్లెటూరి నుంచి వచ్చింది. తన పాకెట్ మనీ కోసం ఎవరి ద్వారానో రాజశేఖర్‌ని కలిసింది. జీవిత డీల్ చేసింది.. అదేమీ క్యాస్టింగ్‌ కౌచ్ కాదు. డైరెక్ట్ డీలింగ్‌.. అమ్మాయిని సెక్సువల్‌గా వాడుకోవడం. బాధిత యువతుల్లో ఒక అమ్మాయి బంధువు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తారు. ఈ విషయం అప్పట్లో నవ్య పేజీల్లో వచ్చింది’ అని సంధ్య వివరించారు. తాను సరైన ఆధారాలు లేనిదే మాట్లాడనని స్పష్టం చేశారు.