సినీ నటుడు రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెల్సిందే. ఆయన ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఔటర్ రింగు రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున అదపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు పేర్కొన్నారు. అయితే దీనిపై ఆయన భార్య, నటి జీవిత స్పందించారు.
రాజశేఖర్ యాక్సిడెంట్‌పై జీవిత వివరణ..వీడియో
Posted by Satyavathi Satya on Tuesday, 12 November 2019
జీవిత మాట్లాడుతూ..మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదు. రామోజీ ఫిల్మ్ సిటీ నుండి వస్తున్న సమయంలో కారు టైర్ బ్లాస్ట్ కావడం వలన డివైడర్ని ఢీకొని కారు పక్కకి వెళ్ళింది. వెనుక వస్తున్న వారు గమనించి రాజశేఖర్‌ని కారులో నుండి బయటకి తీసారు. ఆయన ఫోన్ స్విచ్చాఫ్ కావడం వలన తనని సేఫ్ చేసిన వారి దగ్గర ఫోన్ తీసుకొని ముందు పోలీసులకి సమాచారం అందించారు. ఆ తర్వాత మాకు ఫోన్ చేసి ఎదురు రమ్మని చెప్పడంతో, మేము వెంటనే వెళ్ళాం. ఆయనని ఇంటికి తీసుకొచ్చి చికిత్స అందించాం. పోలీసులకు పూర్తి వివరాలు వివరించాం. వారితో టచ్‌లోనే ఉన్నాం. కోలుకున్న తర్వాత స్టేషన్‌కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని అన్నారు. తప్పక వస్తామని అన్నాం. జరిగింది ఇది. పెద్ద ప్రమాదం అయినప్పటికీ అభిమానుల ప్రేమ వలన ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మీ అందరికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు.