నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తెలుగు చిత్ర సీమలో తనదైన ముద్ర వేసిన జీవితా రాజశేఖర్ గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరమయ్యారు. తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు జీవిత. తిరిగి సినిమాలో 33 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు.‘లాల్‌సలాం’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రజనీకాంత్ సోదరిగా జీవిత కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘లాల్‌సలాం’ చిత్ర బృందం సినిమాలోని ప్రధానపాత్రల పేర్లు ట్వీట్ చేసింది. ఇందులో రజనీకాంత్, విష్ణు విశాల్, జీవిత ఉన్నట్లు తెలుతూ వారి ఫోటోలను షేర్ చేసింది. ఈ చిత్రం మార్చి 7వ తేదీ నుంచి పట్టాలెక్కనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. లాల్ సలామ్ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
తమిళ దర్శకుడు టి.రాజేందర్ ‘ఉరవై కార్తకిలి’ అనే తమిళ చిత్రంలో తొలిసారి జీవిత హీరోయిన్‌గా నటించారు. తర్వాత తెలుగులో తలంబ్రాలు, ఆహుతి, జానకిరాముడు, స్టేషన్ మాస్టర్, అంకుశం వంటి చిత్రాల్లో జీవిత హీరోయిన్‌గా నటించి అలరించారు. రాజశేఖర్‌తో ప్రేమ వివాహం జరిగాగ ఆమె నటనను దూరం అయ్యారు. తర్వాత నిర్మాతగా, దర్శకురాలిగానూ సత్తాచాటారు. శేషు, మహంకాళి,సత్యమేవ జయతే అనే సినిమాలకు జీవిత దర్శకత్వం వహించారు. బతుకు జట్కాబండి అనే టెలివిజన్ షోలో యాంకర్‌గా జీవిత సందడి చేశారు.
ప్రస్తుతం జీవిత భర్త రాజశేఖర్ రెండో ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మరోవైపు పిల్లలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్‌లు కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. తాజాగా జీవిత కూడా 33 ఏళ్ల తర్వాత మేకప్ వేసుకోబోతున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో జీవిత ఏ మాత్రం విజయవంతం అవుతారో చూడాల్సిందే.