సెక్యూరిటీ వుమెన్‌తో టీమిండియా అమ్మాయి స్టెప్పులు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

సెక్యూరిటీ వుమెన్‌తో టీమిండియా అమ్మాయి స్టెప్పులు (వీడియో)

February 27, 2020

Jemimah Rodrigues.

మహిళా క్రికెట్ టీ20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఈ సిరీస్‌లో టీం ఇండియా జట్టు తన సత్తా చాటుతూనే ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఈ సమయంలోనే క్రికెటర్ల డ్రెస్సింగ్ రూంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. టీం ఇండియా మహిళా క్రికెటర్ ఓ సెక్యూరిటీ వుమెన్‌తో కలిసి డ్యాన్స్ చేయడం వైరల్ అయింది. వారి డ్యాన్స్ చూసిన వారంతా ఫిదా అయిపోయారు. 

న్యూజిలాండ్ తో మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లే సమయంలో భారత స్టార్ బ్యాట్స్ ఉమన్ జెమీమా రోడ్రిగ్స్ ఓ మహిళా సెక్యూరిటీ గార్డుతో కలిసి డ్యాన్స్ చేసింది. బాలీవుడ్ హిట్ సాంగ్ కు వీరిద్దరు చేసిన డ్యాన్స్ ఇరగదీశారు. వీరి స్టెప్పులు చూసిన వారంతా ఆశ్చర్యపోయారు.దీన్ని ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా క్రికెట్ అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. కాగా తాజాగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేసింది.