ఆమె వచ్చింది.. ఇన్‌స్టాగ్రామ్ కుప్పకూలింది..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె వచ్చింది.. ఇన్‌స్టాగ్రామ్ కుప్పకూలింది.. 

October 17, 2019

Jennifer .

ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆ యాప్ కొద్దిసేపటివరకు క్రాష్ అయింది. రోడ్డుమీద ట్రాఫిక్ జామ్ అవగా విన్నాం కానీ, సోషల్ మీడియాలో కూడా ట్రాఫిక్ జామ్ అవుంతుందా? అని అనుకుంటున్నారు కదూ. సాధారణంగా ప్రముఖ సినీ తారలు ఏ షాపింగ్ మాలో, గోల్డు షాపో ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు జనాలు ఆమెను చూడటానికి ఎగబడతారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. మరి అలాంటిది తారే రాకరాక ఇన్‌స్టాలోకి వస్తే ఆమె అభిమానులు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు.. తమ శుభాకాంక్షలతో పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో సదరు యాప్‌కు ట్రాఫిక్ బాగా పెరిగి క్రాష్ అయిపోతుంది. అదే జరిగింది హాలీవుడ్ తార జెన్నీఫర్ ఆనిస్టన్ విషయంలో. 

ప్రపంచ ప్రఖ్యాత టీవీషో ఫ్రెండ్స్(F.R.I.E.N.D.S) ద్వారా ఆమె బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే జెన్నీఫర్  ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌కు దూరంగా ఉంది. ఈమధ్యే ఆమె తొలిసారిగా అందులోకి అడుగుపెట్టారు. అంతే.. ఆమె అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. స్వాగతం.. శుభాకాంక్షలు అంటూ కామెంట్లు, లవ్వులతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒకరు ఒకరు అలా వరుసగా గ్రీటింగ్స్‌తో దండెత్తినంత పనేచేశారు. దీంతో ఆ యాప్ క్రాష్ అవక తప్పలేదు. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఉండే ఇన్‌స్టా కూడా వీరిని హ్యాండిల్ చేయలేక చేతులు ఎత్తేసింది.  కొద్ది క్షణాల పాటు నిలిచిపోయింది. అయితే ఇక్కడ మరొక విచిత్రం ఏంటంటే.. ఈ క్రాష్ పై ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారు కూడా స్పందించారు. ‘సరికొత్త రికార్డు నెలకొల్పినందుకు నీకు అభినందనలు’ అంటూ వారు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇదిలావుండగా జెన్నీఫర్ అత్యంత వేగంగా 10 లక్షల ఫాలోవర్లు పొందిన వ్యక్తిగా బ్రిటన్ యువరాజును వెనకకు నెట్టి మరింత ప్రాచుర్యం పొందారు.