Jeremy Lalrinnunga wins gold to extend India's weightlifting medal streak
mictv telugu

భారత్‌కు మరో స్వర్ణం.. 19ఏళ్ల యువకుడికి గోల్డ్ మెడల్

July 31, 2022

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్ మరోసారి సత్తా చాటింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో మరో స్వర్ణం లభించింది. ఆదివారం జరిగిన వెయిట్‌ లిఫ్టింగ్‌ గేమ్‌లో జెరెమీ లాల్‌ రిన్నుంగ్‌ 67కేజీల మెన్స్ వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 19 ఏళ్ల వయసులోనే జెరెమీ ఈ ఘనత సాధించడం విశేషం. ఇదిలా ఉంటే జెరెమీ 300 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్‌లో కొత్త రికార్డు సృష్టించాడు.

ఈ క్రీడల్లో భారత్‌ ఖాతాలో అంతకుముందు నాలుగు పతకాలు రాగా తాజాగా వచ్చిన గోల్డ్ మెడల్‌తో వాటి సంఖ్య 5 కి చేరింది. ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్‌ వుమెన్ మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను పసిడి పతకం సొంతం చేసుకుంది. పురుషుల 55 కేజీల్లో సంకేత్‌ కు సిల్వర్ మెడల్ రాగా.. 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. 55 కిలోల విభాగంలో బింద్యారాణి సిల్వర్ మెడల్ గెలిచింది. భారత్ పతకాల పట్టికలో టాప్ టెన్ లో ఉంది.