ఓకే కాన్పులో నాలుగు దూడలు.. బారులు తీరిన గ్రామస్తులు - MicTv.in - Telugu News
mictv telugu

ఓకే కాన్పులో నాలుగు దూడలు.. బారులు తీరిన గ్రామస్తులు

November 18, 2022

ఏపీలో ఓ ఆవు ఒకేసారి నాలుగు దూడలకు జన్మనిచ్చింది. అంబెడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సాధారణంగా ఆవులు ఒక దూడకే జన్మనిస్తాయి. ఒక్కోసారి రెండు దూడలను జన్మినిచ్చిన సందర్భాలు లేకపోలేదు. కానీ ఆ గ్రామంలో ఓ జెర్సీ ఆవు ఒకేసారి నాలుగు దూడలను ప్రసవించిందన్న విషయం తెలిసి గ్రామస్తులంతా దూడలను చూసేందుకు బారులు తీరారు.

గ్రామ రైతు నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డికి చెందిన జెర్సీ ఆవు రెండు గిత్త దూడలు (మగ), రెండు పెయ్యి దూడలు(ఆడ) లకు జన్మనిచ్చింది. అంతకు ముందు అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పశు వైద్యశాలలో 9 నెలల క్రితం పశు వైద్యుడు భాను ప్రసాద్.. ఆ ఆవుకు ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత నాలుగు దూడలను ప్రసవించింది. జన్మించిన ఆ దూడల్లో ఒక గిత్త దూడ బ్రతికి ఉండగా మిగిలిన మూడు దూడలు చనిపోయాయి. ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు ఇలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకుంటుందని డాక్టర్లు వెల్లడించారు. కాగా బ్రతికి ఉన్న గిత్త దూడ ఆరోగ్యకరంగా ఉందని పశువైద్యులు తెలిపారు.