తిరుమలలో అన్యమత ప్రచారం.. బస్సు టికెట్‌పై జెరుసలెం ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమలలో అన్యమత ప్రచారం.. బస్సు టికెట్‌పై జెరుసలెం ప్రకటన

August 23, 2019

Jerusalem Add On Tirumala Rtc Bus Ticket..

తిరుమలలో అన్యమత ప్రచారం వివాదానికి దారి తీసింది. కొండపైకి వెళ్లే బస్సు టికెట్‌పై జెరుసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనను ముద్రించారు. రాంభగీచ బస్టాండ్‌ కౌంటర్‌లో గురువారం ఇది వెలుగులోకి వచ్చింది. దీన్ని చూసిన భక్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమల వరకు అన్యమత ప్రచారం నిషేధం ఉన్నా అధికారులు, పాలక మండలి పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తమ మనోభవాలు దెబ్బతీసేలా ఇతర మతాలకు చెందిన ప్రకటనలు ముద్రించడం ఏంటని మండిపడుతున్నారు. 

ఈ ఘటనపై బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే టీటీడీ పాలక మండలి అన్యమత ప్రచారంపై చూసి చూడనట్టు వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. ఆర్టీసీ బస్సు టికెట్‌పై ఇలా ప్రకటనలు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమలకు వచ్చే టిక్కెట్ పేపర్‌పై  ఎలాంటి ప్రకటనలు ఉండవని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.పొరపాటున ఐదు పేపర్లు వచ్చి ఉంటాయని వెల్లడించారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.