లైఫ్ లో ఒక్కసారైనా విమానం ఎక్కాలి. గాల్లో తేలినట్టుందే ..పాట పడుకుంటూ ఎంజాయ్ చేయాలి.బట్ మనీ ప్రాబ్లమ్..గాలిమోటర్ టికెట్లు కొనలేం..మనవల్ల కాదు అని చాలాసార్లు కాంప్రమైజ్..ఇదీ సామాన్యుడి తీరని కోరిక. కానీ ఇప్పుడు అలా కాదు..రెండు ఐదొందల మీవి కావు అనుకుంటే ఎంచక్కా విమానం ఎక్కేయొచ్చు.అది ఎలాగంటే…
జియో 4 జీ ఆఫర్ వచ్చాక కామన్ మ్యాన్ లైఫ్ స్టయిల్ మారిపోతుంది. ఆ ఐడియా పానీ పూరి బండోడి నుంచి ఎయిర్ లైన్స్ దాకా ప్రభావం చూపింది.విమానయాన సంస్థలు భారీగా డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎయిర్ ఏషియా, ఇండిగో,జెట్ ఎయిర్వేస్ పోటీ పడి జియోలా ధరలు తగ్గించేస్తున్నాయి. భారతీయ మార్కెట్లో పోటీ పెరగటంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు జెట్ ఎయిర్వేస్ సరికొత్త పరిమితకాల ఆఫర్‌తో ముందుకొచ్చింది. రెయిన్ డీల్స్ పేరుతో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధరను రూ.1,111గా నిర్ణయించింది. ప్రయాణికులకు బుధవారం నుంచి మూడు రోజులపాటు ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్లో బుక్‌చేసుకోవాల్సిన ప్రయాణ టికెట్లు జూన్ 27 నుంచి సెప్టెంబర్ 20 మధ్యలోవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఆఫర్ ఎకానమీ క్లాస్‌కు మాత్రమే. జెట్ ఎయిర్వేస్ నిర్వహించే విమానాలపైన మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. కోడ్‌షేర్, ఇంటర్లైన్పై ఇది వర్తించదు.
సో ఇంకెందుకు లేట్ … వెంటనే బుక్ చేసుకోండి…గాలిమోటర్ ఎక్కాలన్న డ్రీమ్ ను నెరవేర్చుకోండి.