విరహం తట్టుకోలేక విమానం హైజాక్
ప్రైవేట్ విమాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ సంస్థ కార్యకలాపాలను దెబ్బతీయడానికి ఓ ప్రబుద్ధుడు ఏకంగా హైజాక్ డ్రామా అడాడు. విమానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ కు తీసుకెళ్లాలని, లేకపోతే పేల్చేస్తామని విమానంలోని మరుగుదొడ్డిలో బెదిరింపు లేఖ పెట్టాడు. సిబ్బంది అతణ్ని గుర్తించి పోలీసులకు అప్పగించారు. సోమవారం వేకువజామున ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంతో ఈ ఉదంతం చోటుచేసుకుంది. బెదిరింపు లేఖతో విమానాన్ని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న 115 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వారిని ఢిల్లీకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ లేఖను పెట్టిన వ్యక్తి విమానంలోని ప్రయాణించిన 38 ఏళ్ల సల్లా బిర్జు అని అధికారులు గుర్తించారు. ‘అతనికి ఒక ఎయిర్ హోస్టెస్‌తో సన్నిహిత సంబంధముంది. అయితే విభేదాల వల్ల దూరంగా ఉంటున్నారు. వియోగాన్ని తట్టుకోలేక ఈ పని చేసి ఉండొచ్చు. విమాన ప్రయాణానికి ఆటంకం కల్పించేందుకే ఈ లేఖ పెట్టడు’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు చెప్పారు. బిర్జు గతంలోనూ జెట్ విమానంలో ప్రయాణించి రగడ చేశాడు. తన అందించిన భోజనంతో బొద్దింక వచ్చిందని హల్ చల్ చేశాడు.