jetpack army introduced in bengaluru Airoindia show
mictv telugu

భారత సైనిక వ్యవస్థలోకి కొత్త ఆయుధం

February 16, 2023

 jetpack army introduced in bengaluru Airoindia show

భారత్ సైనిక అమ్ములపొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా వెళ్ళే ఫైటర్ జెట్ లు, డ్రోన్లు వచ్చి చేరాయి. ఇప్పడు తాజాగా ఎగిరే సైనికుడు కూడా వచ్చి చేరాడు. పారాచ్యూట్ అవసరం లేకుండా పక్షిలా ఎగురుతూ లక్ష్యాలను చేరుకోవచ్చు . బెంగళూరుకు చెందిన అబ్సల్యూట్ కంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ దీనికి సంబంధించిన జెట్ ప్యాక్ తయారు చేసింది. ప్రస్తుతం బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా ప్రదర్శనలో వీటిని ప్రదర్శించారు.

టర్బైన్ టెక్నాలజీ:

టర్బోజెట్ ల్లాంటి టెక్నాలజీ ఈ జెట్ ప్యాక్ లో ఉన్నాయి. ఇంధనంతో మండించే చిన్నపాటి కంప్రెసర్లతో కూడిన ట్బో ఇంజిన్, 30 లీటర్ల డీజిల్ ట్యాంక్ ను అమర్చారు. ఎయిర్ ఇన్ లెట్ కాంపాక్ట్ ప్లయింగ్ మిషన్ ద్వారా ఇవి ఎగురుతాయి. వీటని మనుషులు డ్రస్ ల్లాగ తొడుక్కోవడమే. మౌంటెన్స్, ఎడారులు, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో వెంటనే వెళ్ళాలంటే ఈ జెట్ ప్యాక్ లు చాలా ఉపయోగపడతాయి. హిట్ అండ్ రన్ కేసుల్లో ఎవరినైనా పట్టుకోవాలంటే కూడా ఇవి ఉపయోగపడతాయి. వీటిని ధరించిన సైనికలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో 15 మీటర్ల ఎత్తు వరకు ఎగరవచ్చును. ఇది పేలోడ్ తో కలిపి 80 కిలోల బరువుతో ఉంటాయి. ఇప్పటివరకు 48 సూట్లు తయారు చేశారు. అవసరాన్ని బట్టి ఇంకా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనను కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మొదలుపెట్టారు. మంథన్ ను ప్రారంభించి మాట్లాడారు. బడ్జెట్ లో రక్షణ రంగానికి కేటాయించిన 1.62 లక్షల కోట్లలో లక్ష కోట్లు స్వదేశీ ఉత్పత్తుల తయారీ కోసమే వాడుతున్నామని ఆయన తెలిపారు.