తెలుగు వెండితెరపైకి మరో హర్రర్ థ్రిల్లర్ మూవీ దూసుకొస్తోంది. సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న ‘జ’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అతిథులుగా సినీ నిర్మాత, మైక్ టీవీ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ హాజరయ్యారు. తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోందని, సృజనాత్మకతకు పెద్ద పీట వేస్తోందని అప్పిరెడ్డి అన్నారు. జ చిత్రంలో హర్రర్, సస్పెన్స్‌తోపాటు సందేశం కూడా ఉంటుందని అన్నారు.
ఫస్ట్‌లుక్‌లో కథానాయికను దెయ్యాల చేతులు చుట్టుముట్టినట్టు చూపారు. ఆమె తలపై రక్తసిక్తమైన దెయ్యం చెయ్యి ఉంది. జ చిత్రం తెలుగుతోపాటు కన్నడ భాషలోనూ రూపొందుతోంది. దీనికి చిట్టెపు సైదిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గోవర్దన్ రెడ్డి కందుకూరు నిర్మాత కాగా, వెంగి సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్ హిమజ ప్రధాన పాత్రలో నటిస్తున్న జలో హీరో ప్రతాప్ హీరో.