అమ్మలాగే.. అనాథల మధ్య శ్రీదేవి కూతురి బర్త్‌డే - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మలాగే.. అనాథల మధ్య శ్రీదేవి కూతురి బర్త్‌డే

March 6, 2018

అందాల తార శ్రీదేవి మరణాన్ని ఆమె కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. కూతుళ్లు జాన్వి, ఖుషీ అమ్మను తలుచుకుంటూ 10 రోజులుగా కన్నీరుమున్నీరువుతున్నారు. తమను ఓదార్చడానికి వస్తున్న వారిని పట్టుకుని బావురుమంటున్నారు. ఈ రోజు పెద్ద పెద్ద కూతురు జాన్వి 21వ జన్మదినం. విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే బర్త్ డేను జరుపుకోవడం జాన్వికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అయితే తల్లి బాటలో ఆమె అనాథాశ్రమంలో ఈ వేడుకను భావోద్వేగంతో జరుపుకుంది.

 

కుటుంబ సభ్యులు, స్నేహితులు సూచనపై ముంబైలోని అనాథాశ్రమానికి వెళ్లి బర్త్ డే కేక్ కట్ చేసింది జాన్వి. మనసులో పెను విషాదాన్ని దాచుకని పైకి నవ్వుతూ కనిపించింది. శ్రీదేవి కూడా అనాథల మధ్య బర్త్ డే జరుపుకునేది. జాన్వి తొలి చిత్రం ధడక్ త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.