జార్ఖండ్ ఎన్నికలు.. తుపాకీతో అభ్యర్థి హల్‌చల్ - MicTv.in - Telugu News
mictv telugu

జార్ఖండ్ ఎన్నికలు.. తుపాకీతో అభ్యర్థి హల్‌చల్

November 30, 2019

జార్ఖండ్  అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఉదయం నుంచి ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో ఘర్షణకు దారి తీసింది. పోలింగ్ బూతుల వద్ద బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. తోపులాట జరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి గన్ తీసుకు వచ్చి హల్‌చల్ చేశాడు. 

పలామూ నియోజకవర్గంలోని కోసియారా గ్రామంలో ఎన్నికల ప్రక్రియ పరిశీలించేందుకు కాంగ్రెస్ అభ్యర్థి త్రిపాఠీ వచ్చారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి అలోక్ చౌరాసియా వర్గీయులు ఆయన్ను అడ్డుకున్నారు. వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వెంటనే త్రిపాఠి తన వద్ద ఉన్న గన్ చేతిలోకి తీసుకొని అక్కడి వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. గన్ బయటకు తీయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మావోయిస్టుల బీభత్సం :

తొలి దశ ఎన్నికల్లో మావోయిస్టుల తమ పంజా విసిరారు. గుల్మా జిల్లాలోని విష్ణుపూర్ ప్రాంతంలో వంతెనను పేల్చేశారు. మందుపాతర పెట్టి ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సున్నిత ప్రాంతాల్లో కట్టుదిట్ట భద్రత మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.