పైసల కోసం పసి వాడి ప్రాణం తీశారు..! - MicTv.in - Telugu News
mictv telugu

పైసల కోసం పసి వాడి ప్రాణం తీశారు..!

August 21, 2017

గోరఖ్ పూర్ లో చిన్నారుల మృత్యుఘోష ఆరకముందే  జార్ఖండ్ లో మరో సంఘటన..కేవలం 50 రూపాయలు తక్కువైనాయని పసివాడి ప్రాణం పోతున్నా పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది.

జార్ఖండ్ కు చెందిన శ్యామ్ కుమార్ అనే వ్యక్తి తన ఏడాది వయసుగల కొడుకు తలకు దెబ్బ తగలడంతో భార్యను వెంట పెట్టుకొని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(రిమ్స్) కి వచ్చాడు.అయితే సీటీ స్కాన్ చేసేందుకు 1350 రూపాయలు కట్టాలని దవాఖాన సిబ్బంది చెప్పింది..పాపం శ్యామ్ కుమార్ దగ్గర 1300రూ ఉన్నయట…50 రూపాయలు తక్కువున్నయ్ సార్,ఇవి తీస్కొని  నా బిడ్డను బత్కియ్యున్రి అని బతిమిలాడినా దవాఖాన్లున్న  డాక్టర్లు  గింతగుడ కనికరం చూపలేదట.అసలే చిన్న ప్రాణం..తలకు తగిలిన దెబ్బను తట్టుకోలేక  చివరకు ఆ పసిప్రాణం గాలిలో కలిసిపోయింది.ప్రాణాల్ని కాపాడాల్సిన డాక్టర్లే యముళ్లై  ఆ పసివాన్ని  పైకి పంపించారు.