Jharkhand CM Hemant Soren's legislative membership revoked
mictv telugu

జార్ఖండ్ సీఎంకు గవర్నర్ షాక్.. ఎమ్మెల్యే పదవి రద్దు

August 26, 2022

జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరేన్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ షాకిచ్చారు. ఆయన శాసన సభ్యత్వం రద్దు చేస్తూ గవర్నర్ రమేష్ బయాస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో
సోరేన్ శాసన సభ్యత్వం రద్దైపోయినట్టే. ఇక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగినా అసెంబ్లీలో మాత్రం ఆయన సభ్యుడిగా కొనసాగలేరు. తనకు తానుగా గనులు కేటాయించుకున్న హేమంత్ సోరేన్‌పై విమర్శలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షనేత, బీజేపీ నాయకుడు రఘుబర్ దాస్ హేమంత్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లగా వారు ఎన్నికల కమిషన్‌కు పంపారు. విచారించిన ఈసీ.. హేమంత్ సభ్యత్వం రద్దు చేయాలని గవర్నర్‌కు సిఫారసు చేసింది. దీంతో గవర్నర్ శుక్రవారం తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ కీలక పరిణామం తర్వాత తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు హేమంత్ ఎలాంటి అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.