Jharkhand: ED Raids 18 Locations Linked To CM Hemant Soren's Close Aide Over Tender Scam
mictv telugu

ముఖ్యమంత్రి నివాసంలో ఈడీ దాడులు

July 8, 2022

Jharkhand: ED Raids 18 Locations Linked To CM Hemant Soren's Close Aide Over Tender Scam

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహిస్తున్నది. టెండర్‌ స్కామ్‌ వ్యవహారంలో సీఎం హేమంత్‌ సహా ఆయన సన్నిహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

సాహెబ్గంజ్, మీర్జా చౌకీ, బెర్హత్‌, రాజ్‌మహల్ సహా మొత్తం 18 ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేస్తున్నారు. సీఎం సోరెన్ ప్రతినిధి పంకజ్ మిశ్రా ఇండ్లలోనూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాడుల సమయంలో ఈడీ అధికారులు పారామిలిటరీ బలగాల సాయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.