10, 12 తరగతుల టాపర్లకు కార్లు గిఫ్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

10, 12 తరగతుల టాపర్లకు కార్లు గిఫ్ట్

September 23, 2020

Jharkhand education minister gifts cars to class 10th, 12th state toppers

కష్టపడి చుదువకుని ర్యాంక్ సాధించిన టాపర్ల శ్రమను ప్రభుత్వం గుర్తించింది. ఆ ఆణిముత్యాలకు కార్లను బహుమతిగా అందించింది. 10, 12వ తరగతి పరీక్షల్లో రాష్ట్ర టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి కార్లను బహుమతిగా ఇచ్చారు. జార్ఖండ్ అకాడెమిక్ కౌన్సిల్ నిర్వహించిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగర్నాథ్ మహతో బుధవారం కార్లను బహుమతిగా అందించారు. 

అంతకుముందే మెట్రిక్యులేషన్ ఫలితాలు విడుదలైతే రాష్ట్ర టాపర్లకు కార్లను బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశ్యాన్ని మంత్రి ప్రకటించారు. ప్రకటించినట్టుగానే మాట నిలబెట్టుకున్నారు. ర్యాంక్ సాధించిన విద్యార్థుల్లో అమిత్ కుమార్ 91.4 శాతంతో 12 వ తరగతిలో అగ్రస్థానంలో నిలవగా, మనీష్ కుమార్ కటియార్ 98 శాతంతో 10వ తరగతిలో మొదటి ర్యాంక్ సాధించాడు.