స్క్రీన్ షాట్ చూపించి మోసం.. ఇంట్లోకెళ్లి చూస్తే వామ్మో..  - MicTv.in - Telugu News
mictv telugu

స్క్రీన్ షాట్ చూపించి మోసం.. ఇంట్లోకెళ్లి చూస్తే వామ్మో.. 

September 29, 2020

JGYKGH

డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయినప్పటి నుంచి మోసాలు ఎక్కువ అవుతున్నాయి. రకరకాల టెక్నిక్‌లతో తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. ఓ వ్యక్తి అయితే దుకాణం యజమానిని నకిలీ స్కీన్ షాట్లు చూపించి డబ్బులు చెల్లించానని చెప్పి మోసగించాడు. ఎంత సేపటికి డబ్బులు అకౌంట్లోకి రాకపోవడంతో తీరా విషయం తెలిసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో చోటు చేసుకుంది. 

ఇషాన్ కుమార్ గిరి (32) ఛట్టీ బజార్‌లో ఓ దుకాణానికి వచ్చి కొనుగోలు చేసిన తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ చేశాడు. అంతకు ముందే సిద్ధంగా ఉంచుకున్న ఓ స్క్రీన్ షాట్ చూపించి వెళ్లిపోయాడు. కానీ ఆ డబ్బులు రాకపోవడంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.గిరిధ్ ఇదే తరహాలో చాలా మోసాలకు పాల్పడినట్టుగా గుర్తించారు. ఇలాంటి అనేక ఫేక్ డాక్యూమెంట్లు, స్క్రీన్ షాట్లు సోదాల్లో లభించాయి. పప్పూమండల్ అనే సైబర్ నేరగాడి సాయంతో ఇవన్నీ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు.  అత్యాధునిక వసతులతో ఉన్న పప్పూ యాదవ్ ఇల్లు చూసి అధికారులు షాక్ అయ్యారు. ఇలాంటి ముఠాపై నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.