పెంపుడు జంతువులపై చాలామందికి మక్కువ ఉంటుంది. ఒక్కొక్కరు దాన్ని ఒక్కోలా చూపిస్తారు. ఇక్కడో కుటుంబం దాని బర్త్ డే పార్టీని ఘనంగా చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.పెంపుడు జంతువులు.. మీరు నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఉత్సాహపరిచేందుకు ఉంటాయి. మరి వాటి ఆనందాన్ని నలుగురితో పంచుకోవాలి కదా! అలాగే చేసిందో కుటుంబం. జార్ఖండ్ లోని ధన్బాద్కు చెందిన సుమిత్ర కుమారి, సందీప్ కుమారి ఒక కుక్కను పెంచుకుంటున్నారు. దానికి ఆస్కార్ అని పేరు పెట్టారు.
ఎంతో ముద్దుగా చూసుకుంటున్న ఆ కుక్కకి మొదటి బర్త్ డే వేడుకను చేయాలనుకున్నారు. 300మందికి పైగా పిలిచారు. కేవలం తమ సమీప గ్రామాల వారినే కాదు.. దూరపు చుట్టాలను ఆహ్వానించారు. అలా వారి ఆహ్వానం అందుకొని సుమారు 350మంది పార్టీకి వచ్చారు.పుట్టినరోజు కోసం బెలూన్లతో డెకరేట్ చేశారు. జిలుగుల మధ్య బర్త్ డే వేడుక మొదలయింది. ఇక బర్త్ డే బాయ్ అయిన ఆస్కార్ కి 4500 రూపాయలు పెట్టి బట్టలు కొట్టించారు. కేక్ మీదనే కాదు.. బ్యాక్ గ్రౌండ్లోనూ ఆస్కార్ ఫొటోల కోల్లెజ్ చేశారు. కేక్ కటింగ్ కి ముందు సంప్రదాయ పద్ధతిలో హారతి పట్టారు. మూడు బంగారు లాకెట్స్ ఉన్న చైన్ ని ఆస్కార్ కి బహుకరించారు. ఆ తర్వాతే కేక్ కట్ చేయించారు. ఈ వేడుకనంతా వీడియో తీశారు. ఇంకా ఆ వీడియోలో కుక్కకు ముద్దులు పెడుతూ సుమిత్ర కనిపించింది. సందీప్ కుక్కకు ఆసరాగా నిలబడ్డాడు. కాసేపటికి అతను గట్టిగా ఆస్కార్ ని కౌగిలించుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కొందరు తమ పెట్స్ తో ఉన్న ఫొటోలు, తమ సెలబ్రేషన్స్ గురించి షేర్ చేసుకోవడం విశేషం.
కుక్క తల్లిదండ్రులు సుమిత్ర కుమారి, సందీప్ కుమారి ఆస్కార్ ను తమ కుటుంబంలో ఒక భాగంగా ఎలా పరిగణిస్తారో తెలిపారు. సందీప్.. ‘నేను పంజాబ్లో పని చేసేవాడిని. అక్కడ ప్రజలు కుక్కలతో ఎలా ప్రవరిస్తారో నేను చూశాను. ఒక రోజు రోడ్డు మీద వెళుతుండగా 20రోజుల కుక్క పిల్లని చూశాం. దాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆస్కార్ అని పేరు పెట్టాం. ఈరోజు అది మాకు దొరికి సంవత్సరం అయిన సందర్భంగా ఈ వేడుక చేస్తున్నాం’ అని చెప్పాడు. సుమిత్ర ‘గతేడాది ఆస్కార్ ని రక్షించాం. ఒక పెట్రోల్ పంప్ దగ్గర మూడు కుక్క పిల్లలు చచ్చిపోయి ఉన్నాయని వెళ్లిపోబోతున్నాం. అందులో ఒకటి బతికే ఉంది. దాన్ని ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్నాం. అది ఇప్పుడు మా ఇంట్లో భాగమైంది. ఆస్కార్ పుట్టిన రోజు సందర్భంగా కుష్టు రోగుల ఆశ్రమానికి పండ్లు పంచి పెట్టాం’ అని చెప్పింది.
धनबाद में एक पालतू कुत्ते की जन्मदिन पार्टी को देख लोग बोले ‘क़िस्मत सहो तो ऐसी’ pic.twitter.com/yRc9iqgQFo
— Shubhankar Mishra (@shubhankrmishra) December 1, 2022