మాజీ సీఎం బాబూలాల్‌కి కరోనా పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

మాజీ సీఎం బాబూలాల్‌కి కరోనా పాజిటివ్

September 26, 2020

nvmnv

దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజుకి సగటున తొంబై వేల కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజూ సగటున వెయ్యి మంది మరణిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలెబ్రిటీలు, ప్రజాప్రతినిధులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. జార్ఖండ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం బాబూలాల్ మరాండీ కరోనా వైరస్ బారిన పడ్డారు. 

శుక్రవారం కరోనా పరీక్ష చేయించుకున్నారని, అందులో పాజిటివ్‌గా తేలిదని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. తనకు కరోనా లక్షణాలు కన్పించడంతో పరీక్ష చేయించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు. గతకొన్ని రోజులుగా తనతో సాన్నిహిత్యంగా ఉన్నవారు వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. పరీక్షల్లో నెగటివ్ వస్తేనే బయటికి రావాలన్నారు.