Jharkhand: IAS officer accused of sexually harassing IITian, suspended
mictv telugu

విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. ఐఏఎస్ అధికారి సస్పెండ్

July 8, 2022

Jharkhand: IAS officer accused of sexually harassing IITian, suspended

మూడు రోజుల క్రితం.. ఓ అధికారిక పార్టీలో ఐఐటీ విద్యార్థిని ప‌ట్ల లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన ఐఏఎస్ ఆఫీస‌ర్‌ను జార్ఖండ్ ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసింది. ఖుంతి జిల్లా స‌బ్ డివిజ‌న‌ల్ మెజిస్ట్రేట్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న అహ్మ‌ద్‌ను మంగ‌ళ‌వారం పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత అత‌న్ని రిమాండ్‌కు త‌ర‌లించారు. త‌న‌ను లైంగికంగా వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు ఓ విద్యార్థిని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అహ్మ‌ద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్రంగా స్పందించారు. అహ్మ‌ద్‌ను విధుల నుంచి తొల‌గించాల‌ని ఆదేశించారు.

జార్ఖండ్‌లో డిప్యూటి కమిషనర్ కార్యాలయం అధికారుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విందు కార్యక్రమం జరిగింది. ఐఐటీకి చెందిన ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు సైతం ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఈ క్ర‌మంలో ఆ పార్టీకి అటెండ్ అయిన ఐఏఎస్ అహ్మద్.. ఆ అమ్మాయిని లైంగికంగా వేధించారు. ఈ విష‌యాన్ని బాధితురాలు పోలీసుల‌కు తెలిపింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు అహ్మ‌ద్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు త‌ర‌లించారు.