ఎలాగైనా ఇంటర్మీడియట్ చదువుతా.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్య  - MicTv.in - Telugu News
mictv telugu

ఎలాగైనా ఇంటర్మీడియట్ చదువుతా.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్య 

August 11, 2020

Jharkhand Minister Applies For Intermediate Study

జీవితంలో మంచి స్థాయికి ఎదగాలంటే చదువు అవసరం. అలా అని చదువు లేని వారు చేరుకోలేరా అంటే కాదనలేం. కానీ చదువుతో వచ్చే గౌరవం ఇంకా మంచి ప్రధాన్యతను తీసుకొచ్చిపెడుతోంది. అందుకే జార్ఖండ్ మంత్రి కూడా తాను ఇంకా చదువుకోవాలని అనుకుంటున్నారట. పదో తరగతి వరకే చదివిన తాను ఇంటర్మీడియట్ పూర్తి చేయాలనే ఆసక్తితో ఉన్నానని తెలిపారు. కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటానని అంటున్నారు. 

జార్ఖండ్ హెచ్ఆర్డీ మంత్రి జగ‌ర్నాథ్ మహతో కేవలం పదో తరగతి వరకే చదివారు. కష్టపడి మంత్రి స్థాయికి ఎదిగారు. కానీ ఆయన్ను ఉన్నత చదువులు లేవనే బాధ వెంటాడుతూనే ఉంది. ఏదైన వేదికలపై తన చదువు సామర్థ్యాన్ని ప్రశ్నించినప్పుడు ఇబ్బందిగా ఉంటుందని బాధపడ్డారు. అందుకే ఎలాగైనా ఈ ఏడాది 11వ తరగతిలో చేరుతానని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,416 మోడల్ స్కూళ్ల ఏర్పాటు సహా విద్యార్థులకు సౌకర్యాల కల్పనకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేసిన ఆయన ఈ విధంగా స్పందించారు. దీంతో ఆక్ష్న ఆసక్తికి అంతా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.