జార్ఖండ్ ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో మంటలు చెలరేగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. హజ్రా క్లినిక్ హాస్పిటల్‌లో జరిగిన ప్రమాదంలో వైద్య దంపతులతో సహా మొత్తం ఆరుగురు మరణించారు. మరొకొందరు తీవ్రంగా గాయపడ్డారు. మొదట స్టోర్ రూమ్‌లో చెలరేగిన మంటలు క్రమంగా ఆస్పత్రి మొత్తం వ్యాపించాయి. ఈ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండడంతో జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. ఈ అగ్నిప్రమాదంలో మొదటి అంతస్తులో నివాసం ఉంటున్న .ఈ అగ్నిప్రమాదంలో హాస్పిటల్ మేనేజర్ డాక్టర్ ప్రేమా హజ్రా, ఆమె భర్త డాక్టర్ వికాస్ హజ్రాతో పాటు వారి పనిమనిషి..మరో ముగ్గురు మృతి చెందారు. రోగులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని పోలీసులు తెలిపారు. వీరందరూ దట్టమైన పొగ వల్ల ఊపిరాడక చనిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.బ్యాంక్ మోర్ పోలీస్ట్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.