ముగిసిన జార్ఖండ్ ఆఫరేషన్.. 40మంది సేఫ్ - MicTv.in - Telugu News
mictv telugu

ముగిసిన జార్ఖండ్ ఆఫరేషన్.. 40మంది సేఫ్

April 12, 2022

14

జార్ఖండ్ రాష్ట్రం డియోఘర్‌ జిల్లా బాబా బైద్యనాథ్ ఆలయానికి సమీపంలో రోప్‌‌వేలోని రెండు కేబుల్‌ కార్లు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే, రోప్‌వేవ్‌లో ఇంకా 40 మంది దాక చిక్కుకుపోయారని గుర్తించిన అధికారులు.. వారిని రక్షించేందుకు చేపట్టిన ఆఫరేషన్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. దాదాపు 45 గంటల పాటు సైనికులు శ్రమించి, బాధితుల్ని సురక్షితంగా తీసుకుకొచ్చారు.

 

ఈ ఆపరేషన్‌లో భాగంగా వైమానిక దళం, ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కలిసి ప్రయాత్నాలు చేశాయి. 40 మందికి పైగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన దృశ్యాలను భారత వైమానిక దళం ట్విటర్‌లో షేర్ చేసింది. ఆదివారం సాయంత్రం పర్యాటకులు 786 మీటర్ల పొడవైన వర్టికల్ రోజ్వలో విహరిస్తుండగా, సాంకేతిక కారణాలతో రెండు కేబుల్ కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. అందులో ఒకరు సహాయచర్యల సమయంలో హెలికాప్టర్ నుంచి జారీ కిందపడి చనిపోయారు.

దీంతో ప్రత్యక్షంగా చూసినవారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆందోళనతో కేకలు వేశారు. ఇక, సోమవారం చీకటి పడటంతో ఆగిన సహాయక చర్యలు చేపట్టి, నేడు ఉదయం ప్రారంభమై, మధ్యాహ్నానికి ముగిశాయి. దట్టమైన అటవీ, కొండ ప్రాంతం కావడంతో వాయు మార్గంలో ఈ చర్యల్ని కొనసాగించాల్సి వచ్చింది. అక్కడ చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీళ్లు అందించారు. ఈ ఘటనను ఝార్ఖండ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటనను ఝార్ఖండ్ హైకోర్టు సుమోటోగా తీసుకుని, విచారణకు ఆదేశించింది.