పిల్లలకు పాక్ జతీయ గీతం నేర్పుతున్న జార్ఖండ్ టీచర్ - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లలకు పాక్ జతీయ గీతం నేర్పుతున్న జార్ఖండ్ టీచర్

July 13, 2020

bgb dg

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఉపాధ్యాయులు పిల్లలపై తమ జాతి వ్యతిరేక పైత్యాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జార్ఖండ్ లో వెలుగుచూసింది.

తూర్పు సింఘ్ భూమ్‌ జిల్లా జంషెడ్‌పూర్‌ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌ లో టీచర్ గా పనిచేస్తున్న శైలా పర్వీన్‌ భారతీయ జాతీయ గీతం తోపాటుగా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జాతీయ గీతాలను కూడా పిల్లలకు నేర్పిస్తున్నది. ఈ ఉదంతంపై జిల్లా విద్యాశాఖ యంత్రాంగం విచారణ చేపట్టింది. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు ఆన్‌లైన్‌ లో పాఠాలు చెప్తూ‌ పాక్,  బంగ్లా‌ జాతీయ గీతాలు నేర్చుకోవాలని హోమ్ వర్క్ ఇచ్చింది. వాటికి సంబంధిచిన యూట్యూబ్‌ లింకులను కూడా వారికి షేర్‌ చేసింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర నేత కునాల్‌ సారంగి ఆందోళన వ్యక్తం చేశారు.