Jharkhand: Woman arrested with 28 pythons, snakes worth over ₹50 cr onboard Nilanchal Express
mictv telugu

ఆమె సంచిలో 50 కోట్ల విలువైన పాములు..

November 7, 2022

 Jharkhand: Woman arrested with 28 pythons, snakes worth over ₹50 cr onboard Nilanchal Express

కొందరికి అరుదైన పక్షులను, పాములను పెంచుకోవడం సరదా. కొందరు మూఢ నమ్మకాలతో పెంచుకుంటారు. కొందరు లగ్జరీ కోసం కోసుకుని తింటారు. దీంతో ప్రపంచంలో ఇప్పటికే చాలా అరుదైన జంతుజాలం కనుమరుగైపోయింది. ఉన్నవి కూడా అరకొరే ఉన్నాయి. స్మగ్లర్ వాటినీ వదలడం లేదు. జార్ఖండ్‌లో ఓ మహిళ ఏకంగా రూ. 50 కోట్ల విలువైన పాములను స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. వీటిలో అరుదైన కొండచిలవలు, పాములు, ఊసర వెల్లులు ఉన్నాయి.

టాటా‌నగర్ స్టేషన్‌లోని నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో వెళ్తున్న ఆమె దగ్గర స్మగ్లింగ్ సామగ్రి ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందిందిం. దీంతో రైల్వే పోలీసులు, నిఘా అధికారులు ఆమెను అదుపులోని తీసుకుని తనిఖీ చేశఆరు. పుణేకు చెందిన ఆమె పేరు దేవి చంద్ర. ఆమె సంచిలో కొండ చిలవలు, తాచుపాములతోపాటు పెద్ద సంఖ్యలో ఊసరవెల్లులు, సాలెపురుగులు కూడా కనిపించాయి. వాటిని ఢిల్లీకి తీసుకెళ్లమని నాగాలాండ్‌కు చెందిన ఓ స్మగ్లర్ తనకు చెప్పాడని దేవీచంద్ర తెలిపింది. రైల్లో తీసుకెళ్లి అప్పగించాలని రూ. 8 వేలు మాత్రమే ఇచ్చినట్లు వాపోయింది. స్వాధీనం చేసుకున్న జీవాలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 25 కోట్ల విలువై తెల్ల కొండచిలువ, శాండ్ బోవా ఉన్నాయి.