ఏందీ.. చెత్త బుట్టతోని సెల్ఫీ దిగితే స్మార్ట్ ఫోన్ ఇస్తరా? ఎక్కడ ? ఎవలిస్తరు జల్ధి చెప్పున్రి అని పర్శాన్ అయితున్రా? అవును నిజమే ఇస్తరు కనీ గీ ఆఫర్ మనదగ్గర కాదు.. జార్ఖండ్ రాష్ట్రంల. స్వచ్చ భారత్ లో భాగంగ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూతన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల నిర్లక్ష్యంతో ఎక్కడపడితే అక్కడ చెత్త వేసి కంపు కంపు చేస్తున్నరట. గిసొంటి ఆఫర్ అన్న వెడ్తె పబ్లిక్ చెత్తను రోడ్డుమీద వెయ్యరని ప్రభుత్వం గీ నిర్ణయం తీస్కున్నట్టుంది.అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని లక్కీడ్రాలో గెలిచిన ముగ్గురికి స్మార్ట్‌ఫోన్ అందజేస్తరట. మొదటి 50 సెల్ఫీలు పంపినవారికి ప్రభుత్వం తరఫున ధ్రువపత్రాలు ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనడానికి ప్రజలు డస్ట్‌బిన్‌తో సెల్ఫీ దిగి ఎంఎన్‌ఏసీ ఫేస్బుక్ పేజ్‌కు పంపాలి. ఈ ఫొటోలు పంపడానికి సెప్టెంబర్ 30వరకు గడువు పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఇంకే చెత్తతో సెల్ఫీ కొట్టు…స్మార్ట్ ఫోన్ పట్టు..అని అక్కడ గల్లీ గల్లీకి పుల్ పబ్లిసిటీ కూడ చేస్తున్నరు. గ ఆఫర్ ఏదో మన దగ్గర గుడ పెడితే మంచిగుండు అనిపిస్తుంది కదా.