Jignesh Mevani joined in Congress party
mictv telugu

కాంగ్రెస్‌లో చేరిన జిగ్నేష్ మేవానీ.. వెంటనే కీలక పదవి

July 8, 2022

Vijay Deverakonda released the song promo of Liger

దళితుల సమస్యలపై పోరాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆ వెంటనే ఆయనను గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు కీలక పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఆయన కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్ పేరిట రాజకీయపార్టీని ఏర్పాటు చేసిన జిగ్నేష్.. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపునే వడ్గమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ హోదాలోనే దళితుల సమస్యలపై గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. 1980లో పుట్టిన ఇతని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే. కాగా, ఇటీవల సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు చేశారంటూ గుజరాత్ పోలీసులు జిగ్నేష్‌ను అరెస్ట్ చేశారు. జామీనుపై విడుదలైన అనంతరం అసోం పోలీసులు వచ్చి తమ రాష్ట్రంలో కేసులున్నాయని చెప్పి అక్కడికి తీసుకెళ్లారు. ఆయా కేసులలో బెయిల్‌పై విడుదలైన మేవానీ.. ఇప్పుడు అకస్మాత్తుగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోవడం గమనార్హం.