గుజరాత్ ఎన్నికల్లో మెరిసిన దళిత కిరణం - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్ ఎన్నికల్లో మెరిసిన దళిత కిరణం

December 18, 2017

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో దళిత  హక్కుల కార్యకర్త,  న్యాయవాది  జిగ్నేష్‌ మేవాని భారీ మెజారిటీతో గెలుపొందారు. సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి విజయ్ చక్రవరితిని 18150 ఓట్ల తేడాతో ఓడగొట్టారు. తన గెలుపుపై అనుమానాలను పచాపంచలు చేశారు. ప్రధాని మోదీ హవాను తట్టుకుని నిలబడ్డారు.

36 ఏళ్ల జిగ్నేష్ బనస్కాంత జిల్లాలోని వడ్గాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆయన దళిత హక్కుల కార్యకర్త కావడంతో ఆ స్థానం నుంచి కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు తమ తమ అభ్యర్థులను ఉపసంహరించుకున్నాయి. జిగ్నేష్‌..  బీజేపీ అభ్యర్థి విజయ్‌ చక్రవర్తి ముందు నిలబడలేరని  ప్రచారం జరిగింది. ఒక దశలో అయితే ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. అయితే, అంచనాలను తలకిందులయ్యాయి.ఉనా జిల్లాలో గోవును చంపారనే ఆరోపణలపై దళితులపై అగ్రవర్ణాలు, బీజేపీ కార్యకర్తలు చేసిన దారుణాలను నిరసిస్తూ  జిగ్నేష్‌ ఉద్యమాన్ని నిర్మించారు. అలాగే దళితులకు భూమి ఇవ్వాలని ‘ఆజాదీ కూచ్‌’ పేరుతో ప్రదర్శనలు నిర్వహించారు.  తాను రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బద్ధవ్యతిరేకినని జిగ్నేష్ చెప్పారు. దళితులపై వివక్షలో కాంగ్రెస్ కూడా తక్కువేమీ తినలేదని, ఆ పార్టీకి కూడా తాను మద్దతివ్వనని స్పష్టం చేశారు. బీఏ బీఎల్ చదివిన జిగ్నేష్ పాత్రికేయుడిగానూ పనిచేశారు.