మనం ఏదైనా రెస్టారెంటుకు వెళ్తే తిన్న తిండికి కచ్చితంగా డబ్బు కడతాం. కానీ అమెరికాకు చెందిన యువకుడు మాత్రం ఫ్రీగా తిండి పెడుతున్నాడు. అంతటితో ఆగక వచ్చిన వారికి తన చేతి నుంచి డబ్బులిచ్చి పంపిస్తున్నాడు. ఆలోచిస్తే వీడికేమైనా పిచ్చి పట్టిందా? ఎవరైనా రెస్టారెంట్‌తో వ్యాపారం చేసి డబ్బులిస్తారు. కానీ ఇతనేంటి ఇలాంటి ఆఫర్ ఇచ్చాడు. మరి డబ్బులెలా సంపాదిస్తాడు? అనే ప్రశ్న ప్రతీ భారతీయుడికి వస్తుంది. కానీ అది అమెరికా కాబట్టి అక్కడ విజయవంతమైంది. జిమ్మీ డొనాల్డ్ సన్ అనే ప్రముఖ యూట్యూబర్ ఈ రెస్టారెంట్ ఓనర్. వీడియో కంటెంట్ క్రియేటివిటీలో అందె వేసిన చేయి. ఇతని ప్రతీ వీడియో యూట్యూబులో పది మిలియన్ల వ్యూస్ సాధిస్తుంది.
ఇతను ఫ్రీ రెస్టారెంట్ పెట్టడానికి కారణం కూడా అదే. ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాడు? ఎలా తిరిగి సంపాదిస్తాడు? అనుసరిస్తున్న మార్కెట్ వ్యూహం ఏంటి? వంటి కుతూహలం ప్రతీ ఒక్కరికీ వస్తుంది. ఇదిగో అదే ఇతని పెట్టుబడి. ఈ కుతూహలంతోనే ఈ వీడియోను లక్షల మంది చూశారు. చూస్తున్నారు. దీని ద్వారా అతనికి రెస్టారెంట్‌లో పెట్టిన ఖర్చు కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇలా ఆహారాన్ని ఉచితంగా పంచుతున్నాడన్న పేరుతో పాటు డబ్బు కూడా వస్తుండడంతో జిమ్మీ హ్యాపీగా ఫీలవుతున్నాడు. వాస్తవానికి ఈ వీడియో 2020 డిసెంబర్‌లోనే పబ్లిష్ అయింది. అయితే తాజాగా వైరల్ కావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. మరి ఇలాంటి ఆలోచన మన ఇండియాలో వర్కౌట్ అవుతుందంటారా? కామెంట్ చేయండి.